బాలీవుడ్‌ ప్రేమలో టీమిండియా క్రికెటర్‌

 

టీమిండియా యువ క్రికెటర్‌ పృథ్వీ షా బాలీవుడ్‌ నటి ప్రాచీ సింగ్‌తో లవ్‌లో ఉన్నట్లు రూమార్లు వినిపిస్తున్నాయి. ఢీల్లీి క్యాపిటల్స్‌ ఓపెనర్‌ పృథ్వీ షా యూఏఈలోని హోటల్‌ నుంచి బయటికి వస్తూ స్టయిల్‌గా కళ్లద్దాలు పెట్టుకుంటున్న ఓ వీడియోని తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా పంచుకున్నాడు. ఈ వీడియోకి ‘హ్హ హ్హ ఐ మిస్‌ దట్‌ లాఫ్‌’ అని హీరోయిన్‌ ప్రాచీ సింగ్‌ కామెంట్‌ పెట్టారు. ఆ తర్వాత పృథ్వీ షా నవ్వుతున్న ఫొటోకి ‘క్యూటీ’ అంటూ వ్‌ ఎమోజీని జత చేశారు. ఇక్కడితో ఆగకుండా పృథ్వీ షా పోస్ట్‌ చేస్తున్న ప్రతి ఫొటోకీ ప్రాచీ కామెంట్లు పెట్టారు. దీంతో ప్రాచీ సింగ్‌, పృథ్వీ షాలు డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. నటి ప్రాచి సింగ్‌ పేరు టీవీ పరిశ్రమలో, ఫిల్మ్‌ సర్క్యూట్లో ఇప్పుడు ఒక సంచలనం. ఈ యువ నటి కలర్స్‌ టీవీకి చెందిన ఉడాన్‌ సీరియల్‌లో నటిస్తుంది. ప్రాచీ సింగ్‌, పృథ్వీ షా ఇద్దరూ సోషల్‌ మీడియాలో కాస్త సన్నిహితంగా ఉండటంతో ప్రేమలో పడ్డారు అని బాలీవుడ్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *