కొడాలి నానికి డిప్రెషన్‌, ప్రష్టేషన్‌

రాజధాని రైతులు, మహిళలు కొడాలి నాని ఫొటోకు చేసిన శవయాత్ర చూశాక.. అతనికి డిప్రెషన్‌, ప్రష్టేషన్‌ ఎక్కువైందని టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి సెటైర్‌ వేశారు. ‘నిక్కర్లు వేసే వయస్సు నుంచే చంద్రబాబుని చూశానని చెబుతున్న నాని.. తనకు తానే ఆయన ముందు బాతుబచ్చా అని ఒప్పుకున్నారు. న్యాయంగా, ధర్మంగా మాట్లాడేవారు అంతా నానికి పందులు, కుక్కల్లా కనిపిస్తున్నారు. విడదల రజనీ, రోజా వంటివారు గతంలో జగన్‌ను రాజశేఖర్‌ రెడ్డిని ఏమన్నారో నానికి తెలియదా? వల్లభనేని వంశీ.. జగన్‌ భార్యను జైలుకు పంపుతానన్నది నిజం కాదా? అని ప్రశ్నించారు.
ఇదిలా ఉండగా ‘సొమ్మొకడది, సోకు ఒకడిది అన్నట్లుగా రాజధాని భూములను పేదలకు ఎలా పంచుతారు? రాజధాని రైతులకు, పేదలకు మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకోవడానికి వైసీపీ ప్రభుత్వం కల్లబొల్లి మాటలు చెబుతోంది. నిజంగా ప్రభుత్వానికి పేదలపై ప్రేముంటే రాజధానిలో వారి కోసం చంద్రబాబు ప్రభుత్వం కట్టించిన 5 వేల ఇళ్లను వారికి ఎందుకు ఇవ్వడం లేదు? ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేలా మాట్లాడుతున్న వైసీపీ నేతలు ముఖాలపై ప్రజలే పేడనీళ్లు కొడుతున్నారు’ అని మండిపడ్డారు. ‘జగన్‌ ప్రభుత్వం అమ్ముతున్న ప్రెసిడెంట్‌ మెడల్‌ బ్రాండ్‌ తాగి.. నాని ఏదిపడితే అది మాట్లాడితే మహిళలు చీపుళ్లతో కొట్టరా? అర్థరాత్రి రోడ్లపై తిరిగే ఆడవాళ్లతో తన బొమ్ము దహనం చేయించారంటున్న నాని.. తన ఇద్దరు కూతుళ్లను కూడా అలానే తిప్పుతున్నారా? జగన్‌ కోసం విజయమ్మ, షర్మిళ రోడ్లపైకి వచ్చినప్పుడు టీడీపీ వాళ్లెవరూ ఇంత అసహ్యంగా మాట్లాడలేదు. జగన్‌ పాలనతో విసిగిపోయిన ప్రజలంతా దున్నపోతుని ఎంతకొట్టినా పాలివ్వదుకదా అని సరిపెట్టుకుంటున్నారు’ అని వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *