ఎగ్‌ కాశ్మీరి బిర్యానీ

 

కావసిన పదార్థము : బాసుమతి బియ్యం : అరకేజీ, యాలకులు : 10 గ్రా ॥, దాల్చిన చెక్క : 10 గ్రా ॥, అల్లం : తగినంత, జీడిపప్పు : 25 గ్రా ॥, చెర్రీస్‌ : 25 గ్రా ॥, ఉడికించిన గ్రుడ్లు : 5, నూనె : తగినంత, మిర్చి : 5, కొత్తిమీర : తగినంత, పుదీనా : తగినంత, ఉల్లిపాయ : 1, గరంమసాలా : 1 టేబుల్‌ స్పూన్‌, లవంగాలు : 10 గ్రా ॥, వెల్లుల్లి : 2, కిస్‌మిస్‌ : 25 గ్రా ॥, డ్రైఫ్రూట్‌ : 25 గ్రా ॥, యాపిల్‌ : 1, ఉప్పు : తగినంత, నెయ్యి : 100 గ్రా ॥, పెరుగు : 1 కప్పు, టమోటా : 1

తయారు చేయు విధానం : ముందుగా 1 కి 1 1/2 కొలత చొప్పున నీరు తీసుకొని, అందులో తగినంత, నూరిన అల్లం, వెల్లుల్లి ముద్దను వేయవలెను. తరిగిన పుదినా, పెరుగు, మసాలా సరుకు సగభాగం నీటిలో వేయవలెను. ఈ నీటిని మరగబెట్టి దానిలో ఉప్పును వేసి ప్రక్కన ఉంచుకోవలెను. ఒక పాత్రలో కొద్దిగా నూనె, 100 గ్రా ॥ నెయ్యిని వేసిన తర్వాత మిగిలిన సగం గరం మసాలాను దానిలో వేసి వేయించవలెను. ఇందులో ముందుగా కడిగి ఉంచుకున్న అరకేజీ, బియ్యాన్ని వేసి వేయించవలెను. తర్వాత 5 ఉడికిన గ్రుడ్లును (పచ్చిని తీసివేయాలి) చిన్న చిన్న ముక్కుగా కోసి, అలాగే డ్రైఫ్రూట్స్‌ను, యాపిల్‌ను కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసి ఈ ముక్కలో సగభాగాన్ని వేగుచున్న బియ్యంలో కలపవలెను. తర్వాత ముందుగా ఉంచుకొన్న మరిగే నీటిని కూడా దానిలో వేయవలెను. బియ్యం ఉడికిన తర్వాత పదిహేను నిమిషాల ‘థమ్‌’ చేయవలెను. తర్వాత దీనిని దించి ప్లేటులోకి తీసుకొని మిగిలిన సగభాగం ఫ్రూట్స్‌, కొత్తిమీర, పుదీనా, దానిపై చల్లవలెను

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *