మే నెల నాటికే 60 లక్షల మందికి కరోనా

 

మే నెల నాటికే దేశంలో 64 లక్షల మందికి కరోనా సోకి ఉంటుందని ఐసీఎంఆర్‌ తెలిపింది. దేశవ్యాప్తంగా నిర్వహించిన సీరో సర్వే ఫలితాలను ఐసీఎంఆర్‌ విడుదల చేసింది. మే నెల ఆరంభంలో దేశవ్యాప్తంగా సుమారు 6468388 మందికి కరోనా సోకి ఉంటుందని సీరో సర్వే సంస్థ నివేదికలో వ్లెడిరచింది. ఈ మేరకు ఐసీఎంఆర్‌లో వివరాను ప్రచురించారు. 21 రాష్ట్రాల్లోని సుమారు 28 వేల మంది రక్తనమూనాలు పరీక్షించి ఈ మేరకు నిగ్గుతేల్చారు. మే జూన్‌ నెలల్లో గ్రామీణ ప్రాంతాలకు వైరస్‌ ప్రబలిందని గుర్తించారు. మే నెలో సగటున 82-130 మందికి కరోనా సోకిందని ఐసీఎంఆర్‌ తెలిపింది. మే నెల వరకు జనాభాలో కేవం 1శాతం మంది ఈ వైరస్‌ సంక్రమించిందని పేర్కొంది. దేశంలో కరోనా ఇప్పుడు జెట్‌ స్పీడుతో పరిగెడుతోంది. గత 24 గంటల్లోనే రికార్డు స్థాయిలో 96 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఒక రోజులో దేశంలో నమోదైన కేసుల్లో ఇవే అత్యధికం కావడం గమనార్హం. దీంతో దేశంలో మొత్తం కేసు సంఖ్య 45 లక్షలు దాటింది. మరణాల సంఖ్య 76271కి చేరింది. అయితే భారత్‌లో కరోనా వేవ్‌ ఇప్పుడే కాదు.. లాక్‌ డౌన్‌ ఉన్న సమయంలోనే మొదలైందని ఐసీఎంఆర్‌ అంచనావేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *