చంద్రబాబు హయాంలో ప్రమాదాలు జరిగినా విచారణ జరపలేదు

 

చంద్రబాబు హయాంలో ఎన్ని ప్రమాదాలు సంభవించిన ఎలాంటి విచారణ జరపలేదని మంత్రి సత్యనారాయణ విమర్శించారు. తాడేపల్లిలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేవాలయాల్లో చంద్రబాబు పూజలు చేయాలని చెప్పడానికి సిగ్గుండాలి. దేవుడిని రాజకీ యాలకు ముడిపెట్టడం చంద్రబాబు దుష్ట సంప్రదాయం. అధికారం పోయేసరికి చంద్రబాబుకు అందరూ గుర్తుకు వస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు బడాబాలు మాత్రమే గుర్తుకు వస్తారు. దళితులపై దాడులు చేసిన వారిపై వెంటనే సీఎం జగన్‌ చర్యలు తీసుకుంటున్నారు. ఒక నేత చంద్రబాబుకు వంతపాడతారు. మరొక జాతీయ పార్టీ నేత చర్చ్‌పై రాళ్లురువ్విన వాళ్ళను విడుదల చేయాలం టున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అవసరం లేదా..? చంద్రబాబు తన హయాంలో వైఎస్సార్‌ ఆసరా వంటి కార్యక్రమం ఒక్కటైనా పెట్టారా..? శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *