11గంటలు .. 24 కిలోమీటర్ల ట్రెక్కింగ్‌ .. అరుణాచల్‌ ప్రదేశ్‌ సీఎం పెమా ఖండు సాహస యాత్ర

అనుభవజ్థుడైన ట్రెక్కింగ్‌ చేసే వ్యక్తిలా.. అరుణాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి పెమా ఖండు పెద్ద సాహస యాత్రనే చేశారు. 11 గంటల్లో ఏకంగా 24 కిలోమీటర్ల ట్రెక్కింగ్‌ చేశారు. తవాంగ్‌ నుంచి 97 కిలోమీటర్ల దూరంలో ఉన్న మారుమూ గ్రామం ుగుతాంగ్‌ చేరుకున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకం ప్రయోజనాలు ముందుకు సాగే చివరి వ్యక్తికి చేరుకునేలా చూసేందుకు ఆయన ఈ సాహసం చేశారు. ుగుతాంగ్‌ సముద్ర మట్టానికి 14,500 అడుగు ఎత్తులో ఉన్న ప్రాంతం. ఈ ట్రెక్కింగ్‌లో 41 ఏళ్ల ఖండు పర్వత భూభాగాలు , అడవులు గుండా నడుచుకుంటూ వెళ్లి తన గమ్యస్థానం చేరుకోవడం విశేషం. ఇక ుగుతాంగ్‌ చేరుకున్న మరుసటి రోజు ముఖ్యమంత్రి ఖండు, తవాంగ్‌ ఎమ్మెల్యే సెరింగ్‌ తాషితో పాటు తవాంగ్‌ ఆశ్రమంలోని గ్రామస్తులు , సన్యాసులు జంగ్‌చుప్‌ స్థూప పవిత్ర కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా, 2011 ఏప్రిల్‌ 30న తవాంగ్‌ నుంచి ఇటానగర్‌కు తిరిగి వస్తున్నప్పుడు ుగుతాంగ్‌ గ్రామ సమీపంలో హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన ఖండు తండ్రి, మాజీ ముఖ్యమంత్రి డోర్జీ ఖండు పేరిట ఈ స్థూపం నిర్మించారు. ఇదే విషయాన్ని ఆయన ట్విట్టర్‌ హ్యాండిల్‌ ద్వారా షేర్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *