ఐపీఎల్‌లో తొలి అమెరికన్‌ క్రికెటర్‌ … కేకేఆర్‌ తరపున అలీఖాన్‌ ఆరంగేట్రం

యూఏఈలో మరికొద్ది రోజులో ప్రారంభం కానున్న ఐపీఎల్‌ టోర్నీలో తొలిసారిగా ఒక అమెరికన్‌ క్రికెటర్‌ ఆడబోతున్నాడు. అలీఖాన్‌ పేరు గల ఈ 29 పేస్‌ బౌలర్‌ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టు తరపున బరిలోకి దిగబోతున్నాడు. భుజానికి గాయమైన హేర్నీ గార్నే స్ధానాన్ని అలీఖాన్‌ భర్తీ చేయబోతున్నాడు. గార్నేకు భుజం గాయం తీవ్రంగా ఉండడంతో ఐపీఎల్‌ టోర్నీకి నుంచి తప్పుకుని.. సర్జరీకి వెళుతున్నాడు. అలీఖాన్‌ 2018లో నిర్వహించిన గ్లోబల్‌ టీ20 టోర్నీలో సత్తా చాటడంతో విండీస్‌ ప్లేయర్‌ డాన్‌ బ్రావో దృష్టిని ఆకర్షించాడు. ఫలితంగా గయానా అమేజాన్‌ వారియర్స్‌ తరపున 12 మ్యాచ్‌లో 16 వికెట్లు తీసి.. ఈ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు. కాగా సీపీఎల్‌ టోర్నీలో ట్రినిడాడ్‌ నైట్‌ రైడర్స్‌ జట్టు తరపున బౌలింగ్‌ చేసి .. 7.43 సగటుతో 8 మ్యాచ్‌లో 8 వికెట్లు తీశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *