వరుణ్‌తేజ్‌ సరసన రష్మిక

మెగా హీరో వరుణ్‌ తేజ్‌ ప్రస్తుతం బాక్సింగ్‌ నేపథ్యంలో కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో అల్లు బాబీ నిర్మించబోతున్న ఒక సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్‌ హీరోయిన్‌ సాయి మంజ్రేకర్‌ అనుకున్నారు. కరోనా కారణంగా షూటింగ్‌ నిలిచి పోయింది. ఈ క్రమంలో కొన్ని మార్పులు చేర్పులు జరిగినట్లుగా సమాచారం అందుతోంది. అందులో భాగంగానే సాయి మంజ్రేకర్‌ స్థానంలో రష్మిక మందన్నాను తీసుకున్నట్లుగా తెలుస్తోంది. బాక్సర్‌ అనే వర్కింగ్‌ టైటిల్‌ను ఈ సినిమాకు అనుకుంటున్నారు. కాగా ఈ సినిమాతో పాటు అల్లు అర్జున్‌ పుష్ప, రామ్‌చరణ్‌తో ఆచార్య సినిమాల్లో కూడా రష్మిక నటించబోతుంది. మొత్తానికి ముగ్గురు మెగా హీరోల తో ఒకేసారి ఈ అమ్మడు కలిసి నటించడం పెద్ద విశేషంగా చెప్పుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *