చాలా మంది స్టార్స్‌ డ్రగ్స్‌ వాడతారు

 

తనకు తెలిసినంత వరకు చాలామంది స్టార్స్‌ డ్రగ్స్‌ తీసుకుంటారని చెప్పింది హీరోయిన్‌ పాయల్‌ ఘోష్‌. ప్రయాణం సినిమా ద్వారా టాలీవుడ్‌కి పరిచయమైన పాయల్‌ ఆ తర్వాత తెలుగులో రెండు మూడు సినిమాలు చేసినా గుర్తింపు రాకపోవడంతో బాలీవుడ్‌కు వెళ్లిపోయింది. డగ్స్‌ ఇష్యూ గురించి స్పందిస్తూ ఓ మీడియా సంస్థకు అనేక విషయాలు వెల్లడించింది. డ్రగ్స్‌ వాడితే యాక్టివ్‌గా ఉంటారనేదే వాడే వారి ఫీలింగ్‌ అని చెప్పుకొచ్చింది. డ్రగ్స్‌ తీసుకోవడం వ్ల అభిమానులను తప్పుదారి పట్టిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తనకు సుశాంత్‌ కొన్ని సంవత్సరాలుగా తెలుసునని, అతను ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదంది. తాను గతంలో ఓ ఇండియన్‌ క్రికెటర్‌తో డేటింగ్‌ చేసి బ్రేకప్‌ కావడంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయానని పాయల్‌ ఘోష్‌ తెలిపింది. ఒక దశలో చనిపోతానని అనుకున్న తాను సుదీర్ఘ చికిత్స తర్వాత డిప్రెషన్‌ నుంచి బయటపడ్డానని చెప్పింది పాయల్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *