ప్రేయసికి రూ. 5 కోట్ల రింగ్‌ కొన్న ఫుట్‌బాల్‌ స్టార్‌

ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో తాను కొంతకాలంగా డేటింగ్‌ చేస్తున్న జార్జినా రోడ్రిగ్స్‌ ఏకంగా రూ. 5 కోట్ల రింగ్‌ తొడిగి సంచనం సృష్టించాడు. దాదాపు ఐదేళ్లుగా జార్జినాతో సహ జీవనం క్రిస్టియానో తాను జార్జినాను త్వరలోనే పెళ్లాడబోతున్నట్టు కూడా ప్రకటించాడు. ఇటీవలే ఓ హోటల్‌ లో వీరిద్దరూ ఎంగేజ్మెంట్‌ రింగు కూడా మార్చుకున్నారు. క్రిష్టియానోకు గతంలో పెళ్లైంది. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. భార్యను వదిలేసి జార్జినాతో ఉంటున్నాడు. వీరిద్దరికీ 2017లో ఓ పాప పుట్టింది. 35 ఏండ్ల క్రిష్టియానో.. 26 ఏండ్ల జార్జినాతో మూడేళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్నాడు. వీళ్లిద్దరికీ ఓ పాప కూడా పుట్టింది. అయితే ఇటీవ జార్జినా రోడ్రిగ్స్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించాడు. ఈ సందర్భంగా క్రిస్టియానో తన ప్రేయసికి తొడిగిన రింగ్‌ ఖరీదు అక్షరాల 6 లక్షల 15 వేల పౌండ్లు అట. ఇది మన కరెన్సీలో రూ. 5 కోట్లు. సంచలన వార్తలు ప్రచురించే ‘గాంబ్లింగ్డీల్స్‌’ ఈ విషయాన్ని వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *