ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నానో అర్థం కావడం లేదన్న వైసీపీ ఎంపీ

 

ప్రస్తుతం తాను ఏ పార్టీలో ఉన్నానో అర్థం కావడం లేదని నర్సాపురం ఎపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. అసలు విషయమేమిటంటే పార్లమెంటు సమావేశాలు ప్రారంభం అవుతుండగా ఉదయం వర్చువల్‌ భేటీకి పిలుపునిచ్చారు. ఇందులో పాల్గొనాలని పార్టీ తరఫున ఎంపీలకు సమాచారం ఇచ్చారు. ఉదయం 9 గంటకు సీఎం జగన్‌ వైసీపీ ఎంపీలతో ఏర్పాటు చేసిన పార్లమెంటు సమావేశాల వ్యూహాత్మక భేటీకి రావాని అందరు ఎంపీలకు పంపినట్లే రఘురామరాజుకు కూడా ఆహ్వానం పంపారు. ఎంపీల ఫోన్లకు పార్టీ తరఫున మెసేజ్‌ు పంపారు. వీటిని చూసిన ఎంపీలు జగన్‌తో వర్చువల్‌ భేటీకి సిద్దమవుతున్న తరుణంలో రఘురామరాజుకు 11 గంట 11 నిమిషాలకు ఢిల్ల్లీలోని ఏపీ భవన్‌ ఉద్యోగి నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చింది. జగన్‌తో భేటీకి హాజరుకావొద్దంటూ ఆయన సూచించారు. దీంతో రఘురామరాజు షాకయ్యారు. అదే విషయాన్ని లిఖిత పూర్వకంగా ఇవ్వాలని కోరారు. అయితే అటు నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడంతో రఘురామ ఆగ్రహానికి గురయ్యారు. మిగిలిన ఎంపీలు మాత్రం యథావిథిగా వర్చువల్‌ భేటీకి హాజరైన తర్వాత పార్లమెంటుకు వెళ్లిపోయారు. వైసీపీ ఎంపీ భేటీకి తనను మెసేజ్‌ ద్వారా ఆహ్వానించి కాల్‌ చేసి రావొద్దని కోరడంపై రఘురామ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని బట్టి తనను పార్టీ నుంచి బహిష్కరించినట్లే భావిస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *