వైఎస్‌ జగన్‌ పాత్రలో నాగార్జున ?

 

‘ఆనందో బ్రహ్మ’ ‘యాత్ర’ సినిమా దర్శకుడు మహి వి. రాఘవ్‌ నాగార్జునతో ఓ సినిమా తీయబోతున్నట్లు సమాచారం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి బయోపిక్‌గా వచ్చిన యాత్రతో మంచి విజయాన్ని అందుకున్న రాఘవ్‌ ఇప్పుడు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని ఇన్స్పిరేషన్‌గా తీసుకొని హీరో పాత్ర డిజైన్‌ చేసారని.. సీఎంగా ప్రజాసంక్షేమానికి పాటు పడే ఆ క్యారక్టర్‌ కి కమర్షియాలిటీ జోడిరచి ఈ సినిమాని రూపొందిస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో అనుకుంటున్నారు. ‘కింగ్‌’ అక్కినేని నాగార్జునతో రాఘవ్‌ ఓ సినిమా ప్లాన్‌ చేస్తున్నా డట. మహి చెప్పిన స్టోరీ లైన్‌ నాగార్జునకు బాగా నచ్చడంతో ఈ సినిమా చేయడానికి నాగార్జున గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలిసింది. నాగార్జున ప్రస్తుతం ‘వైల్డ్‌ డాగ్‌’ సినిమాలో నటిస్తున్నాడు. దీని తర్వాత ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *