పలాస దర్శకుడితో సుధీర్‌

 

పలాస సినిమా దర్శకుడు కరుణకుమార్‌తో సుధీర్‌బాబుతో ఓ సినిమా చేయబోతున్నాడట. ఇప్పటికే కరుణ కుమార్‌ సుధీర్‌ బాబుకు ఆకట్టుకునే కథను వివరించారని హీరో ఓకే చెప్పాడని తెలిసింది. ఈ చిత్రం ఒక చిన్న టౌన్‌ పరిసరాలలో సాగే ఘాఢమైన ప్రేమకథతో తెరకెక్కనుందట. ఇంకా టైటిల్‌ నిర్ణయించని ఈ చిత్రంలో సుధీర్‌ బాబు పాత్ర కొత్తగా ఉంటుందని సరికొత్త యాసను మాట్లాడ తాడని తెలుస్తోంది. ఇంతకుముందు ఎప్పుడూ చూడని సరికొత్త రూపంతో సుధీర్‌ కనిపిస్తాడట. ఇక సుధీర్‌ బాబు పుల్లె గోపిచంద్‌ బయోపిక్‌లో నటించాల్సి ఉండగా అది జనవరిలో ప్రారంభమవుతుందని కూడా తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *