నోరూరించే ఎగ్‌ మసాలా

4 కోడిగుడ్లను ఉడికించాలి. తరవాత పెంకు తీసి కాసేపు మంచి నీళ్లలో వేసి ఉంచాలి. ఇలా చేయడం వ్ల తెల్లసొన సాగకుండా ఉంటుంది. నాన్‌స్టిక్‌ పాన్‌లో నూనె వేసి కాగాక కొద్దిగా జీల కర్ర వేసి వేయించాలి. తరవాత ఒక ఉల్లి పాయ తరిగి దాంట్లో వేసి వేయించాలి. ఇప్పుడు 3 దాల్చినచెక్క ముక్కలు వేయాలి. ఉల్లిముక్కలు వేగాక తగినంత దనియాపొడి, ఎండుమిర్చి పొడి, పసుపు, వెల్లులి, ఉప్పు వేసి కపాలి. రెండు నిమిషాలు తరవాత సిమ్‌లో పెట్టి సన్నగా తరిగిన లేదా మెత్తగా రుబ్బిన రెండు టొమాటోలు గుజ్జు చేసి దానిని వేసి, నీళ్లు పోసి మూతపెట్టి ఉడికించాలి. గ్రేవీ పచ్చి వాసన పోయి మంచి వాసన వస్తూ దగ్గరగా ఉడికిన తరవాత నీళ్లు వంపేసి గుడ్లను సగానికి కోసి కూరలో వేసి మరికాసేపు ఉడికించి దించాలి. వడ్డించే ముందు కొత్తిమీర చల్లాలి. ఇప్పుడు గుమగుమలాడే ఎగ్‌ మసాలా కూర మీ కోసం రెడీ అయినట్లే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *