మెగాస్టార్‌కి గుండు ఎలా చేశారో చూశారా ?

నాలుగు దశాబ్దాల కెరీర్‌లో మెగాస్టార్‌ ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసినప్పటికీ డీ గ్లామర్‌ క్యారెక్టర్‌లో ఆయన కనిపించడం చాలా తక్కువే. అలాంటిది ఈమధ్యే ఆయన సడెన్‌గా గుండుతో కనిపించేసరికి టాలీవుడ్‌ జనాలతో పాటు ఆయన అభిమానులు విస్తుపోయారు. కొత్త సినిమా మేకోవర్‌ అని గుసగుసలు కూడా వినిపించాయి. అయితే అసలు విషయం బయట పెట్టేశారు మెగాస్టార్‌. అది రియల్‌ గుండు కాదని, తమ టెక్నీషియన్స్‌ ఇలా తయారు చేశారని తెలుపుతూ ఆ వీడియోను అందరి ముందుంచారు మెగాస్టార్‌. ఈ మేరకు తన లుక్ ‌ వెనకున్న సీక్రెట్‌ను స్వయంగా రివీల్‌ చేశారు. ‘’నా కొత్త లుక్‌ను అందరూ నిజమని నమ్మేలా చేసిన ఇండస్ట్రీలోని టెక్నీషియన్స్‌ అందరికీ థాంక్స్‌. మేజిక్‌ ఆఫ్‌ సినిమాకు సెల్యూట్ ’’ అంటూ పోస్ట్‌ పెట్టారు చిరంజీవి. మొత్తానికి చిరంజీవి ఈ ప్రయత్నలు చూస్తుంటే ఆయన కొత్త సినిమాలో గుండుతో కనిపించే ఛాన్సుందని అనుకుంటున్నారు అభిమానులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *