చైనా నుంచి మరో వ్యాక్సిన్‌

 

ఔషధ దిగ్గజం చైనా నేషనల్‌ ఫార్మాస్యూటికల్‌ గ్రూప్‌ (సినోఫార్మ్‌), యూఎస్‌ కాన్సినో బయోలాజిక్స్‌ 6185చే అభివృద్ధి చేయబడుతున్న నాలుగవ కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ను చైనా సైన్యం ఉపయోగించడానికి జూన్‌ నెలో ప్రభుత్వం ఆమోదం తెలిపింది. నాలుగు కరోనావైరస్‌ వ్యాక్సిన్లు నవంబర్‌ నాటికి సాధారణ ప్రజలకు అందుబాటులోకి వస్తాయని, చైనా సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) అధికారి ఒకరు తెలిపారు. చైనా నాలుగు వ్యాక్సిన్లు క్లినికల్‌ ట్రయల్స్‌ చివరి దశలో ఉన్నాయని వెల్లడిoచారు. వీటిలో మూడిoటిని ఇప్పటికే అత్యవసర సేలు అందిస్తున్న వారికి ఇచ్చామని తెలిపారు. వారికి జూలై నెలలోనే ఈ వ్యాక్సిన్‌ ఇచ్చినట్లు వెల్లడిoచారు. మూడవ దశ క్లినికల్‌ ట్రయల్స్‌ సజావుగా సాగుతున్నాయని, ఇవి నవంబర్‌ లేదా డిసెంబర్‌లో సాధారణ ప్రజలకు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఏప్రిల్‌లో స్వయంగా తానే ప్రయోగాత్మక వ్యాక్సిన్‌ తీసుకున్నానని ఒక అధికారి తెలిపారు. తరువాత తనకి ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ రాలేదని ఆమె పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *