రష్యా వ్యాక్సిన్‌తో సైడ్‌ ఎఫెక్ట్స్‌

ప్రపంచంలోనే మొట్ట మొదటి కరోనా వ్యాక్సిన్‌గా రష్యా పరిచయమైన ‘స్పుత్నిక్‌-వి’తో ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తినట్లు తాజాగా ప్రభుత్వమే మరో ప్రకటన చేసింది. స్వయంగా రష్యా ఆరోగ్య శాఖ మంత్రి మిఖాయిల్‌ మురష్కో ఆ విషయాన్ని మంగళవారం ప్రకటించారు. ‘‘ట్రయల్స్‌లో భాగంగా 300 మందికి పైగా వాలంటీర్లకు టీకాలు వేశాం. అందులో 14 శాతం మంది రకరకాల ఇబ్బందులకు లోనయ్యారు. కొందరికి అలసట, ఇంకొందరికి కండరాల నొప్పులు కలగ్గా, మరికొందరిలో శరీర ఉష్ణోగ్రత పెరి గింది’’ అని మంత్రి వివరించారు. క్లినికల్‌ ట్రయల్స్‌లో పాల్గొని, వ్యాక్సిన్‌ డోసులు వల్ల స్వస్థతకు గురైన వాలంటీర్లను ఆయా సెంటర్ల లోనే ఉంచి చికిత్స అందిస్తున్నామని, నిజానికి వారికి తలెత్తినవి చిన్న సమస్యలేనని, వ్యాక్సిన్‌ మాన్యువల్‌లోనూ ఇలా జరగొచ్చని రాసుందని, కాబట్టి స్పుత్నిక్‌-వి సేఫ్టీపై ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని రష్యా ఆరోగ్య మంత్రి మిఖాయిల్‌ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *