మీ కులస్థులకు, మతస్థులకేనా పోస్టులు ? : వైసీపీ రెబెల్‌ ఎంపీ రఘరామ

మీ కులస్థులకు, మతస్థులకేనా పోస్టులు ? ఇంకెవరు లేరా? అంటూ వైసీపీ అధినాయకత్వాన్ని ప్రశ్నించారు ఆ పార్టీ రెబెల్‌ ఎంపీ రఘరామ కృష్ణంరాజు. పార్లమెంట్‌ వెలుపల ఎంపీ రఘురామ మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పక్కన ఉండే వారు విపరీతంగా దోచేస్తున్నారని ఆరోపించారు. నీటి పారుదల శాఖ, రోడ్లలో బీభత్సమైన అవినీతి జరగుతోందన్నారు. రెడ్లు అందరూ మంచి సీట్లు తీసుకున్నారు. ఎక్కడో రాజ్యసభలో విజిటర్స్‌ గ్యారీలో మరికొంత మందిని కూర్చోబెట్టి.. కనీసం 50 శాతం కూడా అటెండెన్స్‌ లేని కొందరు, మీ సామాజిక వర్గం, కొంతమంది మీ అడుగుకు మడుగు ఒత్తేవారికి పెద్ద పీట వేశారు’’ అంటూ రఘురామ విరుచుకుపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *