ముంబై – హైదరాబాద్‌ మధ్య బుల్లెట్‌ ట్రైన్‌

దేశంలోనే తొలి బుల్లెట్‌ రైలు ప్రాజెక్టును ముంబై-అహ్మదాబాద్‌ మధ్య 508.17 కిలోమీటర్ల దూరంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించింది మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం. దాని అంచనా వ్యయం రూ.1.08 లక్షల కోట్లు. వాస్తవానికి ఆ మార్గంలో 2023 డిసెంబర్‌లోనే బుల్లెట్‌ రైలు సేవలను ప్రారంభించాని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే భూసేకరణ సంబంధిత సమస్యలు కరోనా మహమ్మారి విజృంభణ వంటి ఆటంకాల కారణంగా ఆ ప్రారంభ తేదీని 2028 అక్టోబరుకు వాయిదా వేసే సంకేతాలు కనిపిస్తున్నాయి. త్వరలో దేశవ్యాప్తంగా ఏడు కొత్త బుల్లెట్‌ రైళ్లను తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు చేస్తోంది. ఇందులో ముంబై-హైదరాబాద్‌ కూడా ఉంది. వీటికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను సిద్ధం చేయాలని జాతీయ హైస్పీడ్‌ రౖుె కార్పొరేషన్‌ను కేంద్రం ఆదేశించింది. ఈ ఏడు రైళ్లకు మొత్తం అంచనా వ్యయం దాదాపు రూ.10 లక్షల కోట్లు ఉంటుందని ఓ అధికారి తెలిపారు. కేంద్రం నిర్ణయంతో ఇప్పటికే విశ్వనగరంగా పేరుగాంచిన హైదరాబాద్‌ మరింత అభివృద్ధి దిశగా సాగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *