భారత్‌లో వ్యాక్సిన్‌ వచ్చే ఏడాదిలోనే సాధ్యం

భారత్‌లో వ్యాక్సిన్‌ వచ్చే ఏడాదిలోనే సాధ్యమయ్యే అవకాశాలు ఉన్నట్లు మైక్రోసాఫ్ట్‌ సహవ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ అంచనా వేశారు. కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ తయారీలో భారత్‌ కీలక పాత్ర పోషించనుందని మైక్రోసాఫ్ట్‌ సహవ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ మరోసారి స్పష్టం చేశారు. మిగతా దేశాల్లో వ్యాక్సిన్‌ ముందుగానే అభివృద్ధి చేసినా.. తయారీలో మాత్రం భారత్‌ సహకారం ఎంతో కీలకమన్నారు. సమర్థవంతమైన, సురక్షితమైన వాక్సిన్‌ వచ్చిన వెంటనే, భారత్‌ నుంచి భారీ స్థాయిలో ఉత్పత్తి అయ్యే అవకాశాలున్నాయని బిల్‌గేట్స్‌ తెలిపారు. భారత్‌లో కరోనా విజృంభణ గురించి ప్రస్తావించిన ఆయన, భారీ జనసాంద్రత కలిగిన దేశంలో వైరస్‌ కట్టడి చేయడం కాస్త కష్టమేనన్నారు. భారత్‌లో వచ్చే రెండు మూడు నెలలు ఎంతో కీకమని బిల్‌గేట్స్‌ అభిప్రాయపడ్డారు.ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 38 వ్యాక్సిన్లు మానవ ప్రయోగ దశలో ఉండగా, మరో 93వ్యాక్సిన్లు ప్రీ క్లినికల్‌ ట్రయల్స్‌ దశలో ఉన్నట్లు ఆయన వ్లెడిరచారు. ఆస్ట్రాజెనికా, నోవావాక్స్‌, సఫోని, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వ్యాక్సిన్‌ తయారీ భారత్‌లోనే చేపట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని బిల్‌గేట్స్‌ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *