మాజీ అడ్వకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌పై కేసు

అమరావతి భూ కుంభకోణంలో దమ్మాలపాటి శ్రీనివాస్‌పై అభియోగాలు రావడంతో ఏసీబీ కేసు నమోదు చేసింది. శ్రీనివాస్‌పై ప్రివెన్షన్‌ కరెప్షన్‌ 409, ఐపీసీ 420 రెడ్‌ విత్‌ 120-బి సెక్షన్ల కింద కేసులను నమోదు చేసినట్లు ఏసీబీ పేర్కొంది. ఈ కుంభకోణంలో దమ్మాలపాటి శ్రీనివాస్‌తో పాటు మరో 12మందిపై కూడా కేసు నమోదు చేసినట్లు తెలిపింది. కాగా చంద్రబాబు హయాంలో దమ్మాలపాటి అడ్వొకేట్‌ జనరల్‌గా ఉన్న సంగతి తెసిందే. బాబు హయాంలో అధికారిక హోదాలో ఉంటూ శ్రీనివాస్‌ అక్రమాలకు పాల్ప డ్డట్టు సాక్ష్యాధారాలు లభించాయంటున్నారు. 2014లో మామ, బావమరిది పేర్లతో భూములు కొన్న దమ్మాలపాటి 2015, 2016లో అవే భూములను ఆయన పేరుకు బదలాయింపు చేసుకున్నట్లు తెలిసింది. చంద్రబాబు తెచ్చిన సీఆర్డీఏ కోర్‌ క్యాపిటల్‌ పరిధిలో ఉండేలా దమ్మాలపాటి భూములు కొనుగోలు చేసినట్లు ప్రాథమిక సాక్ష్యాధారాలు లభించాయి. అయితే ఈ అంశంపై దమ్మాలపాటి శ్రీనివాస్‌ సోమవారమే హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిసింది. తనను అరెస్ట్‌ చేయొద్దంటూ హైకోర్టులో దమ్మాలపాటి ముందస్తు పిటిషన్‌ వేశారు. ఈ మేరకు కేంద్రానికి రాష్ట్ర హోంశాఖ రాసిన లేఖను కొట్టేయాని ఆయన హైకోర్టును కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *