కుల్‌ భూషణ్‌ జాదవ్‌ అప్పీల్ కు మరో నాలుగు నెలలు

మన దేశానికి చెందిన నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌ అప్పిల్ చేసుకునేందుకు గడువును పాకిస్థాన్‌ పార్లమెంటు మరో నాలుగు నెలలు పొడిగించింది. కుల్‌ భూషణ్‌ జాదవ్‌ అప్పిల్ చేసుకునేందుకు వీలు కల్పిస్తూ పాకిస్థాన్‌ ప్రభుత్వం మే నెలో ఓ ఆర్డినెన్స్‌ జారీ చేసింది. ఇంటర్నేషనల్‌ కోర్ట్‌ ఆఫ్‌ జస్టిస్‌ (రివ్యూ అండ్‌ రీకన్సిడరేషన్‌) ఆర్డినెన్స్‌ పేరుతో జారీ అయిన ఈ ఆర్డినెన్స్‌ గడువు ఈ నెల 17తో ముగుస్తుంది. పాకిస్థాన్‌ మిలిటరీ కోర్టు ఆయనకు విధించిన మరణ శిక్షను పునఃసమీక్షించాని అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) ఆదేశించిన నేపథ్యంలో పాక్‌ ప్రభుత్వం ఈ వెసుబాటు కల్పించింది. కుల్‌భూషణ్‌ జాదవ్‌ గూఢచర్యం, ఉగ్రవాద కార్యకలాపాలకు ప్పాడినట్లు పాకిస్థాన్‌ ఆరోపిస్తోంది. 2017లో ఆయనకు మరణ శిక్ష విధిస్తూ పాకిస్థాన్‌ మిలిటరీ కోర్టు తీర్పు చెప్పింది. ఆయనను అక్రమంగా అరెస్టు చేసి, శిక్ష విధించారని భారత ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతర్జాతీయ న్యాయస్థానంలో ఫిర్యాదు చేసింది. ఆయనకు విధించిన మరణ శిక్షను పునఃసమీక్షించాని పాకిస్థాన్‌ ప్రభుత్వాన్ని ఐసీజే ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణ వచ్చే నెలలో జరుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *