మెగాబ్రదర్‌ నాగబాబుకి కరోనా

 

టాలీవుడ్‌లో ఇప్పటికే చాలా మంది సినీ సెలబ్రిటీలు కోవిడ్‌ ప్రభావానికి గురైనవారే. రాజమౌళి, ఎం.ఎం. కీర వాణి, ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం, బండ్లగణేష్‌, కమెడియన్‌ పృధ్వి, శివపార్వతితో పాటు మరికొందరు టీవీ నటులు కూడా కరోనా పడ్డారు. వారిలో చాలామంది కోలుకోగా ఎస్పీ బాలు మాత్రం ఇంకా హాస్పటల్‌లోనే కరోనాకు చికిత్స చేయించుకుంటున్నారు. ఇప్పుడు మెగాబ్రదర్‌ నాగబాబు కరోనా వైరస్‌ ప్రభావానికి గుర య్యారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్‌ ద్వారా తెలియచేశారు. ”ఇన్‌ఫెక్షన్‌ ఎల్లప్పుడూ మనల్ని బాధకు గురిచేయదు. దాన్ని ఇతరులకు సాయం చేసే అవకాశంగా మలుచుకోవాలి” అని అన్నారు నాగబాబు. తాను త్వరలోనే కోలుకుని ప్లాస్మా డోనర్‌గా మారుతానని ఆయన తెలిపారు. ఈ మధ్య నాగబాబు ఓ టీవీలో షోలో పాల్గొంటున్నారు. బహుశా అక్కడి నుండే ఆయనకు కరోనా సోకి ఉండవచ్చునని భావిస్తున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *