అందుకే అచ్చెన్నాయుడిపై జగన్‌కు కోపం

 

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఆయన కొడుకు, ప్రస్తుతం జగన్‌ చేసిన అవినీతిని తమ పార్టీ నాయకుడు ఎర్రన్నాయుడు బయటపెట్టాడనే అచ్చెన్నాయుడిపై జగన్‌ కక్ష కట్టాడని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఆరోపించారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్న వ్యక్తి నేడు మోదీకి దాసోహమైంది కేసుల భయంతో కాదా అని ప్రశ్నించారు. 23 మంది ఎంపీలు, ఆరుగురు రాజ్యసభ్యులను చేతిలో ఉంచు కొని, ఒక్కరోజు కూడా కేంద్రాన్ని ప్రశ్నించే ధైర్యం జగన్‌ చేయలేకపోయారని దుయ్యబట్టారు. అవినీతిపరులు సంగతి తేల్చండని బీజేపీ నేత సుప్రీంలో వేసిన పిటిషన్‌తో తనకు ముంపు ముంచు కొస్తుందని జగన్‌కు అర్థమైందన్నారు. అందుకే తనపై ఉన్న కేసుల విచారణ ప్రారంభమై, ప్రజలు తనను ఛీకొడతారని భావించే సిట్‌ విచారణ పేరుతో వారి దష్టి మళ్లించడానికి జగన్‌ తంటాలు పడుతున్నాడని విమర్శలు గుప్పించారు. అలాగే గతంలో తనకు శిక్షపడేలా వాదించాడనే నేడు దమ్మాలపాటి శ్రీనివాస్‌పై బురదజల్లాలని చూస్తున్నారని మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *