అమరావతిలో రాజధాని వస్తుందని టీడీపీ నేతలకు ముందే తెలుసు

 

చంద్రబాబు అవినీతి చేసి డబ్బు ఎలా సంపాదించాలో తెలిసిన మాస్టర్‌. ఆయన ఎన్ని స్టేలు తెచ్చుకున్నారో ప్రజలందరికీ తెలుసునని మంత్రి కోడాలి నాని దుయ్యబట్టారు. అమరావతిలో రాజధాని వస్తుందని టీడీపీ నేతలకు ముందే తెలుసునని చెప్పారు. భూములు కొనుగోలు చేసుకోవాలని టీడీపీ నేతలకు చంద్రబాబు ముందే చెప్పారని ఆరోపించారు. రాజధానిలో రైతులను మోసం చేసి ఎకరం రూ.25 లక్షలకు కొనుగోలు చేశారని మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్త చేశారు. రాజధాని వ్యవహారంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు అండ్‌ కో బాగుపడ్డారని మంత్రి కొడాలి నాని అన్నారు. బాబు ప్రమేయం ఉందని తేలితే ఆయన మీద కూడా కేసులు పెడతారు. టీడీపీ నేతలు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసి కోట్లు గడించారని విమర్శించారు. ‘మేం ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచీ భూ కుంభకోణం జరిగిందని చెప్తున్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుంభకోణంపై కేబినెట్‌ సబ్‌ కమిటీ, సిట్‌ నియమించారు. గత మార్చిలోనే అమరావతి రాజధాని భూ కుంభకోణంపై.. సీబీఐ విచారణకు ఆదేశించాలని కేబినెట్‌ ఆమోదంతో కేంద్రాన్ని కోరాం. కరోనా వల్లో లేకపోతే సీబీఐకి దేశవ్యాప్తంగా అనేక కేసులు ఉండటంతోనో జాప్యం జరిగింది. కేంద్రం నిర్ణయం రాకపోవడంతో ఏసీబీ దర్యాప్తునకు సీఎం ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. చంద్రబాబు, అతని బినామీలు లాయర్లకు కోట్లాది రూపాయలు ఫీజులు చెల్లించి.. కోర్టులో వారి పేర్లు బయటకు రాకుండా స్టేలు తెచ్చుకున్నారని మంత్రి కోడాలి నాని ఆరోపించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *