చుట్టు ఉన్న వ్యక్తుల వల్లే జగన్‌కు చెడ్డ పేరు

 

తన చుట్టూ ఉన్న వ్యక్తులు చేస్తున్న చెడ్డపనులతో.. నిష్కల్మషమైన సీఎం జగన్‌కు చెడ్డపేరు వస్తోందని నర్సాపురం ఎంపీ రఘురామకష్ణ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి భూముల మీద సిట్‌ విచారణపై స్టే విధించడాన్ని స్వాగతిస్తున్నానని తెలిపారు. ఒక సామాజికవర్గాన్ని ఇబ్బంది పెడుతున్నారన్న భావన ఉందన్నారు. న్యాయవ్యవస్థపై దాడి సరికాదు, తగ్గించుకుంటే బాగుంటుందని హితవు పలికారు. తనతో సన్నిహితంగా ఉన్న ఎంపీలను బెదిరించారని, రాయలసీమలో కూర్చొని ఖబడ్దార్‌ రఘురామ అంటే భయపడనని హెచ్చరించారు. వైసీపీపీ సమావేశానికి పిలవకపోవడంపై స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తానని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *