హిట్టు కోసం వెయిటింగ్‌

 

కృష్ణగాడి వీర ప్రేమగాధ సినిమాతో నానితో జత కట్టడం ద్వారా టాలీవుడ్‌కి పరిచయమైంది పంజాబీ ముద్దుగుమ్మ మెహరీన్‌. ఆ తర్వాత శర్వానంద్‌తో చేసిన మహానుభావుడు సినిమా కూడా హిట్ట కావడంతో ఒక్కసారిగా లక్కీఛార్మ్‌గా ఈ అమ్మడుకు పేరు వచ్చింది. చాలాకాలంగా ఫ్లాప్‌లతో సతమతమవుతున్న రవితేజ సరసన నటించిన రాజా ది గ్రేట్‌ కూడా సూపర్‌ హిట్‌ కావడంతో గోల్డెన్‌ లెగ్‌గా స్థిరపడిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ అనుహ్యాంగా సాయిధరమ్‌తేజ్‌తో నటించిన జవాన్‌ డిజాస్టర్‌ కావడంతో స్పీడ్‌కి కాస్త బ్రేక్‌ పడింది. జవాన్‌ దెబ్బ నుంచి కోలుకోకముందే విజయ్‌దేవరకొండతో నటించిన ద్విభాషా చిత్రం నోటా కూడా నోటీస్‌లో లేకుండా పోవడం, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో చేసిన కవచం ప్రేక్షకుల మైండ్‌లో గుచ్చుకోవడం, ఆ వెంటనే గోపిచంద్‌తో చేసిన పంతం పత్తాలేకుండా పోయింది. ఐరన్‌లెగ్‌గా మారిపోయింది. అయితే రాజా ది గ్రేట్‌తో తనకు మంచి హిట్టచ్చిన అనిల్‌ రావిపూడి మరోసారి అమ్మడికి ఎఫ్‌ 2 రూపంలో మరిపోలేని హిట్టిచ్చి మళ్లీ లైమ్‌లైట్లోకి తెచ్చాడు. పాపం మెహరీన్‌ సంతోషం ఎంతో కాలం ఆగలేదు కల్యాణ్‌రామ్‌తో చేసిన ఎంతమంచివాడువురా పై పెద్ద హోప్స్‌ పెట్టుకున్న ఆ సినిమా కూడా ఆశించినట్లు హిట్టు కాలేదు. కాగా ఇప్పుడు అమ్మడు తెలుగులో చివరి సారిగా నటించిన చాణక్య ఫ్లాప్‌ కాగా నాగశౌర్య ఆశ్వద్ధామ పర్వాలేద నిపించింది. తెలుగులో మళ్లీ మునుపటి స్టార్‌డమ్‌ అందుకోవడానికి తన శాయశక్తులు ప్రయత్నాలు చేస్తుందట. చూడాలి ఫన్‌ 2 సినిమాలోలా అందాల ఆరబోసే క్యారెక్టర్లో నటించి కుర్రకారుని ఆకట్టుకుని మళ్లీ స్టార్‌గా వెలుగుతుందేమో.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *