కోహ్లీకి జట్టు ఎంపిక గురించి పెద్దగా అవగాహన లేదు

 

విరాట్‌ కోహ్లీకి జట్టు ఎంపిక గురించి పెద్దగా అవ గాహన లేదని టీమిండియా మాజీ ఆటగాడు, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్‌ తెలిపాడు. ముంబై ఇండియన్స్‌ సారథిగా రోహిత్‌ శర్మ నాలుగు టైటిళ్లు గెలిస్తే.. మహేంద్ర సింగ్‌ ధోనీ చెన్నై సూపర్‌ కింగ్స్‌ను మూడుసార్లు చాంపియన్‌గా నిలబెట్టాడని గుర్తు చేశాడు. ధోనీ నేతత్వంలోని సీఎస్‌కే కనీసం ఆరు-ఏడు మ్యాచ్‌ల వరకూ ఆటగాళ్లపై నమ్మకం ఉంచి వారినే కొనసాగిస్తూ ఉంటుంది. కోహ్లీ కెప్టెన్సీలోని ఆర్‌సీబీ మాత్రం చాలా తొందరగా ఆటగాళ్లను మారుస్తూ ముందుకు వెళ్తుంది. ఇదే ధోనీ-కోహ్లీ సారథ్యంలో ఉన్నా ప్రధాన తేడా. అటు సీఎస్‌కే సక్సెస్‌కు.. ఇటు ఆర్‌సీబీ వైఫల్యానికి కూడా ఇదే కారణం. మ్యాచ్‌ మ్యాచ్‌కు క్రికెటర్లను మారుస్తూ ఉంటే వారిలో నిలకడ పోతుంది. ఈ ఐపీఎల్‌లోనైనా ఆరు-ఏడు మ్యాచ్‌ల వరకూ ఆర్‌సీబీ ఆటగాళ్లను మార్చకుండా ఉంచి నిలకడ కోసం ప్రయత్నించాలి.’అని గంభీర్‌ సూచించాడు. గత 8-9 ఏళ్లుగా ఆర్‌సీబీని నడిపిస్తున్న కోహ్లీ వ్యక్తి గతంగా పరుగులు చేసినా.. ఒక్క టైటిల్‌ కూడా అందించలేకపోయాడని విమర్శించాడు. కనీసం ఈ సీజన్‌లోనైనా టైటిల్‌ తీసుకురావాలన్నాడు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *