యూవీ బ్యానర్‌లో మాస్‌ మహారాజ్‌

మాస్‌ మహారాజ్‌ రవితేజ ప్రస్తుతం గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. శృతిహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకి క్రాక్‌ అనే టైటిల్‌ కూడా ఫిక్స్‌ చేశారు. కరోనా వల్ల ఆగిపోయింది కాని లేకపోతే ఇప్పటికే ఈ సినిమా రిలీజ్‌ కావాల్సింది. కాగా ఈ సినిమా తర్వాత రవితేజ మరో రెండు మూడు సినిమాలు లైన్లో పెట్టినట్లు తెలిసింది. అందులో ఒకటి యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో చేయబోతున్నట్లు టాలీవుడ్‌ సమాచారం. యూవీ బ్యానర్‌ అంటే మినిమమ్‌ హిట్‌ గ్యారంటీ అనే పేరుంది. ఖచ్చితంగా ఆ సినిమాతో రవితేజ ఖాతాలో మరో హిట్‌ ఖాయమంటున్నారు. కాగా ఈ సినిమాతో పాటు సినిమా చూపిస్తా, నేను లోకల్‌ దర్శకుడు త్రినాధరావు దర్శకత్వంలో కూడా రవితేజ ఓ సినిమా చేయబోతున్నట్లు తెలిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *