అమెరికా కు చెందిన శాస్త్రవేత్తలు ఓ అణువును కనిపెట్టారు. ఈ అణువు కరోనా వైరస్‌ను అంతమొందిస్తుందని వారు చెబుతున్నారు. ఈ అణువు సాయంతో కరోనాకు తేలికగా మందు కనిపెట్టవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అయితే ఈ ఏడాది చివరినాటికి.. లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో దీనిపై క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించనున్నారు. ఈ అణువును కనిపె ట్టింది అమెరికాకు చెందిన ప్రఖ్యాత పిట్స్బర్గ్‌ యూనివర్సిటీ పరిశోధకులు. ఈ అణువు.. కరోనా వైరస్‌ను న్యూట్రిలైజ్‌.. తెలుగులో చెప్పా లంటే తటస్థం చేస్తుందని సదరు పరిశోధ కులు తేల్చారు. అంతేకాక ఈ అణువు శరీరంలోని వెళ్లిన వెంటనే భారీ స్థాయిలో యాంటీబాడీస్‌ ను ఉత్పత్తి చేసి కరోనా మహమ్మారిని అంతమొందిస్తుందని చెప్పారు. కాగా ఇప్పటికే జంతువులపై చేసిన ప్రయోగాలు సక్సెస్‌ కావడంతో మనుషులపై ప్రయోగాలు చేస్తున్నారు. అయితే ఈ అణువుపై మరింత విస్తత స్థాయిలో ప్రయోగాలు జరుగవలసి ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. చైైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను అతలా కుతలం చేసింది. అన్ని దేశాలు ఆర్థికంగా పతనమయ్యాయి. మందులేని ఈ మాయదారి రోగం జనాలను సర్వనాశనం చేసింది. ఓ వైపు కరోనా వచ్చిన నిరు పేదలు ఆస్పత్రి బిల్లులు కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో వైపు కరోనా దెబ్బ కు ఉపాధి కోల్పోయి ఇంకొందరు పేదలు ఆకలి తో అలమటిస్తున్నారు. మొత్తం మీద ఈ రోగం ప్రపంచాన్ని వణికించింది. అయితే కరోనా మహమ్మారి అంతమొందించే వ్యాక్సిన్ను కనిపెట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు తీవ్రంగా శ్రమిస్తు న్నారు. ఇప్పటికే చాలా దేశాలు తీసుకొచ్చిన వ్యాక్సిన్లు మొదటి రెండో ట్రయల్స్‌ను పూర్తిచేసుకొని.. మూడోదశ ట్రయల్స్‌ నిర్వహిస్తున్నాయి.

…………………………………………………………………………………………………………………………………

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *