గాయాలు మనతోనే ఉంటాయి

గాయపడాలని ఎవరూ కోరుకోరు.’జీవితంలో గాయలెప్పుడూ మనతోనే ఉంటాయని తెలుసుకున్నానని తెలిపాడు టీమిండియా ఆల్‌రౌండర్‌ హర్థిక్‌ పాండ్యా. ఈ శనివారం చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగే ఫస్ట్‌ మ్యాచ్‌ కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తు న్నట్లు వెల్లడించాడు. అయితే అలా జరగకుండా ఉండదనేది సత్యం. గాయాలెప్పుడూ ఒకడుగు ముందుకేసుందుకే నాకు ప్రేరణనిస్తాయి. లాక్‌డౌన్‌ సమయంలో ఫిట్‌నెస్‌ కోసం ఇబ్బందులేమీ పడలేదు. మా ఇంట్లో జిమ్‌ ఉండటంతో నేనూ, నా సోదరుడు కనాల్‌ పాండ్యా రోజూ కసరత్తులు చేశాం. జీవితంలో మరెన్నో అద్భుతాలు జరుగుతాయని అనిపిస్తోంది’ అని పాండ్యా ఆశాభావం వ్యక్తం చేశాడు. గాయాలు తనకు మరింత ప్రేరణనిస్తాయని హార్దిక్‌ పాండ్యా తెలిపాడు. ప్రస్తుతం మానసికంగా, శారీరకంగా ప్రశాంతంగా ఉన్నానని తెలిపిన ఈ విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ ఐపీఎల్‌ కోసం ఆగలేకపోతున్నానన్నాడు. ఆసియాకప్‌ సమయంలో గాయపడ్డ హార్దిక్‌ పాండ్యా వెన్నెముకకు శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. దాంతో అతను కొంతకాలం అంతర్జాతీయ మ్యాచులకు దూరమయ్యాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *