ఓటీటీలో నిశ్వబ్దం

 

బహుబలి సినిమా తర్వాత అనుష్క మరే సినిమాలోనూ కనిపించలేదు. చాలాకాలం గ్యాప్‌ తర్వాత పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, కోన పిల్స్‌ కార్పొరేషన్‌ సంస్థల సంయుక్తంగా నిర్మిస్తున్న నిశ్శబ్దం సినిమాలో నటిస్తోంది. చాలా కాలం క్రితమే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పట్లో ధియేటర్లు తెరిచే ఛాన్సులు లేకపోవడంతో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్‌ చేయడానికి నిర్మాత కోన వెంకట్‌ ప్లాన్‌ చేస్తున్నాడట.ఈ సినిమాను అక్టోబర్‌2న ఒటిటిలో విడుదల చేయడానికి అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు. మాధవన్‌, అంజలి, షాలినీ పాండే తది తరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి దర్శకుడు హేమంత్‌ మధుకర్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *