క్రేజ్‌ లేకపోయినా ఫోజులు కొడుతుంది

 

అందాల ఆరబోతకు ఎలాంటి అడ్డు చెప్పరనే మన నిర్మాతలు బాలీవుడ్‌ హీరోయిన్ల వెంటప డుతుంటారు. వారి అందాల్ని క్యాష్‌ చేసు కోవాలని ఎంత ఖర్చయినా వెనకాడ కుండా వారి వెంటపడుతుంటారు. అలా పడ్డ ఆశే ఒక్కోసారి కొంప ముంచేస్తుంది. ఇప్పుడు అలాంటి చిక్కుల్లో పడ్డాడట దర్శక నిర్మాత సంపత్‌ నంది. బాలీవుడ్‌ హాట్‌ ఆటమ్‌ బాంబ్‌ ఊర్వశీ రౌతేలా. సోషల్‌ మీడియాతో పాటు బాలీవుడ్లో తనదైన హాట్‌ నెస్‌తో హీటెక్కించేస్తోంది. ఇన్స్టాలో ఈ భారీ క్రేజ్‌ మామూలుగా లేదు. 30 మిలియన్‌ల మంది ఊర్వశిని ఫాలో అవుతున్నారు. అయితే తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఈ సుందరి కొత్తే. అయినా తెలుగు వారిని మెస్మరైజ్‌ చేయడానికి వెబ్‌ సిరీస్‌ తో ఎంట్రీ ఇస్తోంది. సంపత్‌నంది స్టోరీ స్క్రీన్‌ ప్లే అందిస్తున్న బ్లాక్‌ రోజ్‌ వెబ్‌ సిరీస్‌తో ఎంట్రీ ఇస్తోంది. కె.కె. రాధామోహన్‌ ఈ వెబ్‌ సిరీస్‌ని నిర్మిస్తు న్నారు. హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుగుతోంది. ఇప్పటి వరకు 10 రోజులు షూటింగ్‌ పూర్తయింది. దీంతో ఊర్వశి ముంబై తిరిగి వెళ్లిపోయింది. అయితే ఊర్వశి ఖర్చులు చూసి నిర్మాత గుండె గుభేలు మందట. ఒప్పుకున్న రెమ్యునరేషన్‌తో పాటు అదనంగా కావాలంటోందట. కోవిడ్‌ కారణంగా బడ్జెట్‌ తగ్గించుకోవాలని నిర్మాతలు చూస్తుంటే ఊర్వశి మాత్రం డబ్బులు డిమాండ్‌ చేస్తోందట. సర్వీస్‌ అపార్ట్‌మెంట్‌లో వుండి సహకరించమని కోరితే తాను నోవాటెల్‌ లో మాత్రమే వుంటానని కండీషన్‌ పెట్టిందని తెలిసింది. దీనికి తోడు తను షూటింగ్‌ ప్లేస్‌కి రావడానికి బెంజ్‌ లగ్జరీ కార్‌ ప్రతీ రోజు అంటే షూటింగ్‌ జరిగినన్ని రోజులు పంపించాలని డిమాండ్‌ చేసిందట. అమ్మడికి తెలుగులో ఎలాంటి క్రేజ్‌ లేకపోయినా ఏరికోరి తెచ్చుకున్న నిర్మాతలకు చుక్కలు చూపిస్తుందంటున్నారు టాలీవుడ్‌ జనాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *