ఎగ్‌ ఫైనాపిల్‌ కేక్‌

 

10 గ్రుడ్లలో తెల్ల సొనను తీసి బాగా కలిపి, దానిలో 200 గ్రాముల పంచదారను వేసి సుమారు పావుగంట సేపు బాగా కలపవలెను. తర్వాత గ్రుడ్లలోని పచ్చసొనను కూడా వేసి కలపవలెను. దీనిలో 200 గ్రాముల మైదా, 1 చెంచా వెనీలా ఎస్సెన్సు వేసి పైకి నురగ వచ్చేంత వరకు బాగా కలపవలెను. ఆ తర్వాత ఒక ట్రేలో పేపరును వేసి దానిపైన ఈ మిశ్రమాన్ని పోయవలెను. ఆ ట్రేని ‘కేక్‌ ఓవెన్‌’లో పెట్టి 150 ఫారిన్‌ సెంటీగ్రేడ్‌ వద్ద సుమారు 25 నిమిషాల సేపు ఉంచవలెను. ఒక గిన్నెలో క్రీమును వేసి, దానిలో 10 గ్రాముల పంచదారను వేసి ఈ గిన్నెను ఐసు ముక్కల మధ్యలో పంచదార, క్రీములు బాగా కలపవలెను. ఈ మిశ్రమంలో మనకి కావలసిన రంగులు వేసుకొని ఆ క్రీముని సిద్ధంగా ఉంచుకోవలెను. ఆ తర్వాత ‘ఓవెన్‌లసో నుండి కేక్‌ని బయటికి తీసి మనకి కావలసిన డిజైన్‌లో ముక్కలుగా కోసి, ఆ ముక్కలపై ముందుగా ఉంచుకున్న క్రీమును అలంకరించుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *