మరి కొన్ని గంటల్లో ఐపీఎల్‌ పండగ

 

క్రీడాభిమానులు ముఖ్యంగా క్రికెట్‌ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)కు మరి కాసేపట్లో ప్రారంభం అవుతోంది. అబుబాబి వేదికగా ముంబాయి ఇండియన్స్‌ , చెన్నె సూపర్‌ కింగ్స్‌ జట్ల మధ్య జరిగే ప్రారంభ మ్యాచ్‌ ఈ రాత్రి ఏడున్నర గంటలకు ప్రారంభం అవుతుంది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున కరోనా వైరస్‌ కారణంగా ఈ ఏడాది సమ్మర్‌లొ నిర్వహించాల్సిన ఐపీఎల్‌ ఎట్టకేలకు అబుదాబి, దుబాయ్‌, షార్జా వేదికలపై నిర్వహిస్తారు. ప్రేక్షకులు లేకుండా ఖాళీ గ్రౌండ్స్‌లో ఈ సారి ఐపీఎల్‌ నిర్వహించడం ఒక సరికొత్త అనుభూతి అని చెప్పవచ్చు. నవంబర్‌ 10 వ తేదీన నిర్వహించే ఫైనల్‌ మ్యాచ్‌తో సహా మొత్తం 56 మ్యాచ్‌లు 53 రోజుల పాటు కొనసాగుతాయి. అబుదాబిలో 20, దుబాయ్‌లో 24, షార్జాలో 12 మ్యాచ్‌లను నిర్వహిస్తారు. మ్యాచ్‌లు రాత్రి ఏడున్నర గంటలకు ప్రారంభం అవుతాయి. శని, ఆదివారాలలో (వీకెండ్స్‌) రెండేసి మ్యాచ్‌లు ఉన్న రోజున మొదటి మ్యాచ్‌ మధ్యాహ్నం 3.30 గంటలకు , రెండో మ్యాచ్‌ రాత్రి ఏడున్నర గంటలకు ప్రారంభం అవుతుంది. గతసారి ఐపీఎల్‌ విజేతగా నిలిచిన ముంబాయి ఇండియన్స్‌ జట్టుతో మొత్తం ఎనిమిది జట్లు అంటే చెన్నెసూపర్‌ కింగ్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌, కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌, రైజింగ్‌ పూనె సూపర్‌ జెయింట్స్‌ జట్లు ఈ సారి తమ అదృష్టాన్ని పరీకించుకోనున్నాయి. ఈ టోర్నమెంట్‌లో విశేషం ఏమంటే.. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన మహేంద్ర సింగ్‌ ధోని ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ధోని అభిమానులను ఎంతలా అలరిస్తాడో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *