మావోయిస్టులకు ఎదురుదెబ్బ

 

మా బతుకులు మార్చాలంటూ ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులోని సిరిలి మెట్ట, పట్టగడ్డ, కిముడుపుట్టు గిరిజనులు భారీ ర్యాలీ నిర్వహించారు. మారుమూల గిరిజన ప్రాంతాలు ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉండి పోవాలి, మా బిడ్డలకు పురిటి నొప్పులు వస్తే మాకు చావే గతి అవుతుంది. ఇంకా ఎన్నాళ్ళు మాకు ఈ కష్టాలు, మాకు వెంటనే రోడ్లు నిర్మించాలి, మాకు అభివృద్ధి కావాలంటూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఉపాధి హామీ పని రోజులు పెంచాలని , మాకు సెల్‌ టవర్స్‌ రోడ్స్‌ వస్తే మా కష్టాలు తీరుపోతాయని పేర్కొన్నారు. మావోయిస్టు ఆవిర్భావ దినోత్సవం ముందు ప్రజలు ఇంత భారీ ర్యాలీ చేయడం మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ప్రజలు అబివృద్దే కోరుకుంటున్నారు అని మావోయిస్టులు వలనే ఇన్ని రోజులు మా అభివృద్ధి ఆగిపోతుందని, ఇంకా దేనికి భయపడేది లేదని గ్రామస్థులు ముక్త కంఠంతో చెప్పారు. సుమారు గత పది సంవత్సరాలు క్రితం ఇదే సిరిమిమెట్ట గ్రామస్థులు మావోయిస్టులుపై భారీగా కత్తులు, బల్లెలతో తిరుగుబాటు చేసి మీరు మా గ్రామలులోకి రావొద్దు అంటూ హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *