ఎగ్‌ టేస్టీ కట్‌లెట్‌

 

స్టౌ మీద బాణలి పెట్టి నూనె వేడయ్యాక అందులో ఉల్లిముక్కలు, అల్లంవెల్లుల్లి ముద్ద, పచ్చిమిర్చి ముద్ద, కరివేపాకు తరుగూ, కాస్త ఉప్పూ వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగాక పసుపూ, కారం, ధనియాల పొడీ, గరంమసాలా వేయాలి. అందులో ఉడికించి బంగాళాదుంప వేసి మరొకసారి కలపాలి. చివరగా ఉప్పు సరిచూసి కొత్తిమీర చల్లి బాగా కలిపి దించేయాలి. చేతికి నూనెను రాసుకుని ఆలూ మిశ్రమాన్ని చిన్న ముద్దలుగా చేసుకోవాలి. ఆ ముద్దలో 4 కోడిగుడ్లును స్టఫ్‌ చేయాలి. ఇలాగే మిగిలిన కోడిగుడ్లను చేసుకోవాలి. ఆపై గిలకొట్టిన గుడ్డు సొనలో దీన్ని ముంచి, బ్రెడ్‌ పొడిలో అటు ఇటు దొర్లించాలి. ఇలా చేసుకున్న వాటిని వేడి నూనెలో వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. వీటిని వేడి వేడిగా టమోటా సాస్‌పై సర్వ్‌ చేస్టే టేస్ట్‌ అదిరిపోతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *