జగన్‌ దమ్మున్న నాయకుడు : టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి

విశాఖ నగరంలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నగరానికి చెందిన దక్షిణ నియోజక వర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ శనివారం సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని కలిశారు. తీసశీ సందర్భంగా జగన్‌ సమక్షంలో వాసుపల్లి కుమారులు వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ సీఎం జగన్‌పై ప్రశంసలు కురిపించారు. ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తుంది జగన్‌ ధైర్యమే. సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అందరికీ చేరుతున్నాయి. టీడీపీ ఇక ముందుకు వస్తుందని నాకు అనిపించడం లేదు. విశాఖకు ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ ఇచ్చిన ఘనత జగన్‌ది. నా కుమారులు వైసీపీలో చేరడం ఆనందంగా ఉందని వాసుపల్లి గణేష్‌ చెప్పుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *