అమరావతిలో భారీ కుంభకోణం జరిగిందని స్వయంగా ప్రధాని చెప్పారు

 

అమరావతిలో భారీ కుంభకోణం జరిగిందని స్వయంగా ప్రధాని మోదీ చెప్పారనీ ప్రధాని నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. పోలవరంను ఏటీఎంగా వాడుకున్నారని కూడా ఆయన చెప్పిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుందన్నారు.దమ్ముంటే ఇప్పుడు చంద్రబాబు అమరావతి భూ కుంభకోణం, ఫైబర్‌ గ్రిడ్‌ అక్రమాల మీద సీబీఐ విచారణ కోరాలి. అంతర్వేది ఘటనలో ప్రభుత్వం తప్పు లేకపోయినా సీఎం జగన్‌ సీబీఐ విచారణ కోరారు. దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి తన కుమారుడి మీద ఆరోపణలు వస్తే సీబీఐ విచారణకు ఆదేశించారు. కానీ చంద్రబాబు మాత్రం తేలుకుట్టిన దొంగలా ఉన్నారు చంద్రబాబు స్టేలతో బతుకుతున్న వ్యక్తి. రాజధాని పేరుతో బాబు, ఆయన బినామీలు వేల ఎకరాలు కొనుగోలు చేశారు. టీడీపీ పాలనలో పెద్ద కుంభకోణం జరిగింది. ఈ కుంభకోణం మీద ఇప్పుడు ఏసీబీ కేసు నమోదు చేస్తే గజగజ వణుకుతున్నారు. ఓ లాయర్‌ మీద కేసు నమోదు చేస్తే హైకోర్టు గ్యాగ్‌ ఆర్డర్‌ ఇవ్వడం బాధాకరం. ఇది ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నేషనల్‌ మీడియాతో పాటు మేధావులు హైకోర్టు ఉత్తర్వుల మీద విస్మయం వ్యక్తం చేస్తున్నారని రోజా తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *