షూమాకర్‌ కోలుకోవడం అసాధ్యం

 

ఏడు సార్లు ఫార్ములా వన్‌ విజేతగా నిలిచిన మైకేల్‌ షూమాకర్‌ ఇక ఎప్పటికీ సాధారణ స్ధితికి చేరుకోలేడని అతనికి చికిత్స చేస్తున్న వైద్యులు తేల్చిచెప్పారు. ఇదే విషయమై జ్యూరిచ్‌కు చెందిన ప్రఖ్యాత న్యూరాలజీ ప్రొఫెసర్‌ ఎరిక్‌ రీడెరర్‌ మాట్లాడుతూ.. 51 సంత్సరాల వయసున్న షూమాకర్‌ ఇక మామూలు మనిషి కాలేడన్నారు. అతను స్పహలోనే ఉన్నప్పటికీ ప్రతిస్పందించలేడని,.. ఊపిరి పీల్చుకోవ డం, హృదయ స్పందన సక్రమంగానే ఉంటుందన్నారు. అతను లేవగలిగినా నడిచేందుకు ఎవరో ఒకరి సాయం కావాల్సి ఉంటుంద న్నారు. సుమారు ఏడేళ్ల క్రితం అంటే 2013 డిసెంబర్‌ 29న ఫ్రెంచ్‌ పర్వతాలలో ఐస్‌ స్కీయింగ్‌ చేస్తున్నపుడు అదుపు తప్పిన షూమాకర్‌ కింద పడడంతో అతని తల ఒక బండరాయికి బలంగా తాకింది. హెల్మెట్‌ ఉన్నప్పటికీ వేగంగా స్కీయింగ్‌ చేస్తూ వచ్చి పడిపోవడంతో.. అతడి మెదడులోపలి భాగాలు దెబ్బతిన్నాయి. ఒకదానితో ఒకటి కార్లు పోటీ పడుతూ దూసుకుపోయే ఫార్ములా వన్‌ అనగానే ముందుగా జ్ఞప్తికి వచ్చే షూమాకర్‌ అతని ఫ్రొఫెషనల్‌ కెరీర్‌లో అనేక సార్లు గాయపడినా .. మళ్లీ కొద్ది రోజుల్లోనే కోలుకొని మళ్లీ ట్రాక్‌పై తన కారును పరుగులు పెట్టించేవాడు. అలాంటిది సరదాగా ఐస్‌ స్కీయింగ్‌ చేస్తూ.. జీవితం తిరిగి గాడిన పడే అవకాశం లేని విధంగా దెబ్బతినడం బాధాకరం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *