ఒక్క డోసుతో కరోనా అంతం

 

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనాను అంతం చేయడానికి ప్రపంచవ్యాప్తంగా చాలా మంది శాస్త్రవేత్తలు, కంపెనీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఇప్పటికే రష్యా ఓ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా, ప్రముఖ ఫార్మా దిగ్గజం జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ ఈ జాబితాలో చేరింది. ఒక్క డోసుతో కరోనా మహమ్మారిని అంతం చేసే సామర్థ్యం గల వ్యాక్సిన్‌ను తీసుకొచ్చేందుకు కషి చేస్తోంది. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్‌ ప్రయోగాలు తుది దశకు చేరుకోగా, అమెరికా, అర్జెంటీనా, బ్రెజిల్‌, చిలీ, కొలంబియా, మెక్సికో, పెరూలోని 215 చోట్ల మొత్తం 60 వేల మంది వాలంటీర్లపై ప్రయోగించనున్నారు. మంచి ఫలితం రావాలంటే ఏదైనా టీకాను కనీసం రెండుసార్లు ఇవ్వాల్సి ఉంటుంది, కానీ ఒకే ఒక్క డోసుతో కరోనా నుంచి రక్షణ కల్పించే వ్యాక్సిన్‌ను తాము అభివద్ధి చేసినట్టు జాన్సన్‌ అండన్‌ జాన్సన్‌ అధికారి ఒకరు తెలిపారు. కోవిడ్‌ -19 వైరస్‌ జన్యు మార్పిడి ద్వారా సాధారణ జలుబుకు కారణమయ్యే అడినో వైరస్‌తో కలిసి టీకా రూపొందించినట్టు పేర్కొంది. తాము అభివద్ధిచేసిన టీకా రోనా వైరస్‌ను కట్టడి చేసే బ్రహ్మాస్త్రం అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *