డ్రగ్స్‌ ఉచ్చులో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ టీమ్‌ ఆటగాళ్ల భార్యలు

 

ఐపీఎల్‌లో కోల్‌కత నైట్‌ రైడర్స్‌ తరఫున ఆడుతోన్న కొందరు క్రికెటర్ల భార్యలు కొకైన్‌ సేవించారని, దీన్ని తాను కళ్లారా చూశానని బాలీవుడ్‌ నటి షెర్లీన్‌ బాంబ్‌ పేల్చారు. కోల్‌కత నైట్‌ రైడర్స్‌పై ఓ జాతీయ ఇంగ్లీష్‌ న్యూస్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విష యాన్ని వెల్లడించారు. బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌, జుహీచావ్లా కోల్‌కత నైట్‌ రైడర్స్‌ ఫ్రాంఛైజీలుగా ఉన్నారు. డ్రగ్స్‌ రాకెట్‌ వ్యవహారం క్రమంగా ఇండియన్‌ ప్రీమి యర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) మెడకూ చుట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. క్రికెటర్ల భార్యలు కొకైన్‌ తీసుకున్నారన డానికి తానే ప్రత్యక్ష సాక్షినని బాంబు పేల్చారు. దర్యాప్తు చేస్తేనే.. తాను వారి పేర్లను బయటపెడతాననీ అన్నారు. కొంతమంది బాలీవుడ్‌ నటుల భార్యలు కూడా వారితో కలిశారని తెలిపారు. ఆ క్రికెటర్లు ఎవరనే విషయాన్ని వెల్లడించడానికి షెర్లిన్‌ చోప్రా నిరాకరించారు. దీనితో ఈ వ్యవహారం మొత్తం మరో కీలక, అనూహ్య మలుపును తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *