ఉడికించిన గుడ్డుతో గుండె సమస్యలు దూరం..

రోజూ ఉడికించిన గుడ్డు తినడం వల్ల రక్తసరఫరా మెరుగుపడుతుంది. వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగు తుంది. రక్త పోటు అదుపులో ఉండి గుండె సంబంధిత సమస్యలు దూరం అవుతాయి. అదే విధంగా గుడ్డు లోని విటమిన్ ఎ జ్ఞాపకశక్తిని పెంచుతుంది. కంటి సమస్యలతో బాధపడేవారికి గుడ్డుకి చక్కని ఆహారం.. దీనిలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా లివర్ ఆరోగ్యానికి చాలా మంచిది. థైరాయిడ్ని తగ్గించడంలో కూడా గుడ్డులోని ప్రోటీన్స్ మేలు చేస్తాయి. ఉడికించిన గుడ్డులో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి అన్ని వయసుల వారికి మేలు చేస్తాయి. రోజూ గుడ్డుని తినడం వల్ల ప్రోటీన్స్, విటమిన్స్, పోషకాలు ఎక్కువగా పొందొచ్చు. ఇందులో కాల్షియం, ఐరన్ శాతాలు కూడా అధికంగానే ఉంటాయి. వీటితో పాటు విటమిన్ ఎ, బి5, బి12, బి2, కాల్షియం, జింక్ వంటి ఖనిజాలు, 77 క్యాలరీలు, 6 గ్రాముల ప్రోటీన్స్ ఉంటాయి. దీనిని తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గడమే కాకుండా.. రక్తంలోని గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి.