యాంకర్‌గా పీవీ సింధు

 

ప్రముఖ స్పోర్ట్స్‌ మార్కెటింగ్‌ సంస్థ బేస్‌ లైన్‌ వెంచర్స్‌ ‘ది ఎ గేమ్‌’ అనే వెబ్‌ సిరీస్‌ ను భారీ వ్యయంతో నిర్మించనున్నదట. ఈ వెబ్‌ సిరీస్‌లో భాంగా ఇప్పటికే పలువురు ప్రముఖ క్రీడాకారులను సింధూ ఇంటర్వ్యూ చేసింది. రియో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత – రెజ్లర్‌ సాక్షి మాలిక్‌ – షూటర్‌ గగన్‌ నారంగ్‌ – లాంగ్‌ జంపర్‌ అంజు బాబీ జార్జ్‌ – ఫుట్‌ బాలర్‌ బైచుంగ్‌ భూటియా – స్నూకర్‌-బిలియర్డ్స్‌ స్టార్‌ పంకజ్‌ అద్వానీలతో సింధు మాట్లాడింది. ఇందులో స్టార్‌ క్రికెటర్లు – పేరు పొందిన టెన్నీస్‌ క్రీడాకారులు – హాకీ ప్లేయర్లు కూడా ఉండనున్నారట. ఈ సందర్భంగా సింధూ మీడియాతో మాట్లాడుతూ.. ‘నాకు ఈ అవకాశం దక్కడం ఎంతో ఆనందంగా ఉన్నది. ఒత్తడి సమయంలో దిగ్గజ అథ్లెట్ల ఆలోచనా విధానాన్ని వారి శక్తి సామర్థ్యాల్ని తాను ఈ షోలో తెలుసుకుంటా’ అని ఆమె చెప్పారు. అయితే ఈ షో టీవీల్లో వచ్చేది కాదు. యూట్యూబ్‌ – ట్విట్టర్‌ – ఇన్‌ స్టాగ్రామ్‌లో ప్రసారం కానుంది. మామూలుగానే యాడ్స్‌ కు కొన్ని కంపెనీలకు బ్రాండ్‌ అంబాసిడర్‌ గా ఉన్న సింధు భారీ మొత్తంలోనే వసూలు చేస్తోంది. యాంకర్‌ గా కూడా సింధూ భారీ పారితోషికం తీసుకోనున్నట్టు టాక్‌. అయితే మనదేశంలో వివిధ క్రీడల్లో రాణించిన వాళ్లంతా ఈ గేమ్‌ షోలో పాల్గొని తమ అనుభవాలను పంచుకోనున్నా రట. ఇది ఓ తరహా ఇంటర్వ్యూ లాంటి కార్యక్రమం. మొత్తం 5 ఎపిసోడ్లను చిత్రీకరించున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *