కోడిగుడ్డులోని పోషకాలు గురించి మీకు తెలుసా ?

ఒక గుడ్డులో ఫోలెట్‌ ఐదు శాతం, సెలీనియం 22 శాతం, ఫాస్ఫరస్‌ తొమ్మిది శాతం, మిటమిన్‌ ఏ ఆరు శాతం, విటమిన్‌ బి2 .. 15శాతం, బీ5 ఏడు శాతం, బీ12 తొమ్మిది శాతం, ఇంకా విటమిన్‌ డీ, ఈ, కె, కాల్షియం, జింక్‌ లాంటి ఖనిజాలు లభిస్తాయి. అందుకే డాక్టర్లు గుడ్లు తినమని మనకు సలహాలు ఇస్తుంటారు. అలాగే సామాన్యుడికి సైతం అందుబాటులో ఉండే అద్భుతమైన ఆహారం. శాకాహారులు సైతం దీన్ని ఇష్టంగా తింటారు. అతి తక్కువ ఖర్చుతో అన్ని రకాల పోషకాల్ని అందించే గుడ్డు.. సంపూర్ణ ఆహారం. రోజుకి ఒక గుడ్డును ఆహారంలో తీసుకుంటే శరీరానికి మేలు చేసే హెచ్‌డిఎల్‌ కొలెస్ట్రాల్‌ పెరిగి, చెడు కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. వ్యాధి నిరోధక శక్తిని సైతం పెంచుతుంది. ఒక గుడ్డు తెల్లసొనను ఒక కప్పు పాలతో కలిపి, రెండు చెంచాల తేనెతో కలిపి తీసుకుంటే శరీరంలోని అన్ని రకాల విషాలకు విరుగుడుకు పని చేస్తుంది. గుడ్డులో కెరోటినాయిడ్లు, ల్యాటిన్‌, జెక్సాంతిన్‌ అనే పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. గుడ్డులో ఆరు గ్రాముల అత్యధిక ప్రొటీన్‌ ఉంటుంది. దీనిలోని అమైనో ఆమ్లాలు తొమ్మిది రకాల శరీర అవయవాల పని తీరును మెరుగు పర్చేందుకు ఉపయోగ పడతాయి. నిత్యం కోడిగుడ్డు తినడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్స్‌, మినరల్స్‌, కార్బొహైడ్రేట్లు, ఖనిజాలు అందుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *