బాబ్రీ మసీదు విధ్వంసంలో పాక్‌ హస్తం !

 

బాబ్రీ మసీదు విధ్వంసం వెనక పాకిస్థాన్‌ హస్తం ఉండవచ్చంటూ ప్రత్యేక సీబీఐ జడ్జీ ఎస్‌కే యాదవ్‌ బుధవారం బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో తీర్పు సందర్భంగా చేేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. విధ్వంసం జరిగిన రోజున బాబ్రీ మసీదు వద్ద టెర్రరిస్టులు కూడా ఉండి ఉండవచ్చంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ‘బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు బాబ్రీ మసీదును విధ్వంసం చేయకుండా ప్రజలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు’ అంటూ సీబీఐ జడ్జీ యాదవ్‌ చేసిన వ్యాఖ్యలపై కొన్ని పత్రికలు వ్యంగ్యోక్తులు విసిరాయి. ‘1992, డిసెంబర్‌ 6వ తేదీన ఏం జరిగిందో, 2020, సెప్టెంబర్‌ 30వ తేదీన ఏం తీర్పు వెలువడిందో మనందరికి తెలుసు. బాబ్రీ విధ్వంసం తర్వాత చెలరేగిన అల్లర్లలో చిమ్మిన రక్తం ఎంతో మనలో కళ్లతో చూసిన వారు ఉన్నారు. ఇదంగా ఎవరు చేశారో మనకు తెలుసు. ఎందుకు చేశారో మనకు తెలుసు. దాని వల్ల జాతికెంత నష్టమో మనకు తెలుసా? వారికి న్యాయబద్ధత కల్పిస్తున్నాం. ఎన్నికల అనంతరం ఎన్నికల్లో గెలిపిస్తూ వస్తున్నాం. ఇప్పుడు నిరాశతో ఓండ్ర పెడితే లాభం ఏమిటీ?! ది టెలీగ్రాఫ్‌ పత్రిక వ్యాఖ్యానించిడం విశేషం. ‘బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు బాబ్రీ మసీదును విధ్వంసం చేయకుండా ప్రజలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు’ అంటూ సీబీఐ జడ్జీ యాదవ్‌ చేసిన వ్యాఖ్యకు తమిళ పత్రిక ‘దినమలార్‌’ ప్రాధాన్యతనిచ్చింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ సీబీఐ సుప్రీం కోర్టుకు వెళుతుందా? అంటూ కూడా ఆ పత్రిక సందేహం వ్యక్తం చేసింది. పాలకపక్ష బీజేపీ నేతలు ఎల్‌కే అడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషి, కళ్యాణ్‌ సింగ్‌, ఉమా భారతి సహా మొత్తం 32 మంది నిందితులు నిర్దోషులని, వారు బాబ్రీ విధ్వంసానికి ముందస్తు కుట్ర పన్నారనడానికి ఎలాంటి ఆధారాలు లేవంటూ బుధవారం కోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *