విశాఖ  అంటే మీకు గిట్టదా

 

విశాఖ  అంటే మీకు గిట్టదా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు టీడీపీ సీనియర్‌ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు. ఇటీవల విశాఖ కంటకుడు చంద్రబాబు పేరుతో విజయసాయి రెడ్డి సోషల్‌ మీడియాలో పోస్ట్‌లపై దేవినేని స్పందించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఒప్పందాలను కావాలనే రద్దు చేశారని ఆరోపించారు. లక్నోలో 2 వేల కోట్ల రూపాయలతో లులు గ్రూప్‌ మాల్‌ నిర్మిస్తోందని దేవినేని ఉమా తెలిపారు. దానికి సంబంధించిన ఫొటోలను పోస్ట్‌ చేశారు. అయితే రాష్ట్రంలోనూ ఇలాంటి నిర్మాణాల కోసం గత ప్రభుత్వ హయాంలో ఒప్పందం జరిగిందని తెలిపారు. కానీ వాటిని జగన్‌ సర్కార్‌ రద్దు చేశారని విమర్శలు గుప్పించారు. ఆ మాల్‌ నిర్మిస్తే ఇక్కడి యువతకు ఉపాధి లభించేది కదా అని అన్నారు. ఉత్తరాంధ్ర యువతకు ఉద్యోగం కల్పించడం మీకు ఇష్టం లేదా అని దేవినేని ఉమా.. ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విశాఖపట్టణం బీచ్‌ రోడ్డులో దీనికంటే పెద్ద మాల్‌ హోటల్‌ నిర్మాణానికి గత ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని దేవినేని ఉమా గుర్తుచేశారు. దానిని కొనసాగించాల్సింది పోయి.. రద్దు చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. విశాఖపట్టణం కాక, శ్రీకాకుళం, విజయనగరం 10 వేల మందికి ఉద్యోగాలు వచ్చేవి అని తెలిపారు. కానీ అడ్డుపడింది ఎవరని ప్రశ్నించారు. దీంతో నిజమైన ఉత్తరాంధ్ర ద్రోహి ఎవరో అర్థమవుతుందని చెప్పారు. దీంతోపాటు ఉత్తరాంధ్రకు చంద్రబాబు చేసిన న్యాయం గురించి వరసగా పోస్టులు చేశారు. అయితే ఉత్తరాంధ్రకు ద్రోహం చేసింది తాము కాదని.. వైసీపీ ప్రభుత్వమేనని దేవినేన ఉమా ఆరోపించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *