ధోనీపై రైనా అలక

 

టీమిండియా మాజీ ఆటగాడు, చెన్నై సూపర్‌కింగ్స్‌ ఆల్‌రౌండర్‌ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2020 సీజన్‌లో ఆడటం లేదు. జట్టుతో కలిసి యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ దాకా వెళ్లి మరీ రిటర్న్‌ అయ్యాడు. స్వదేశానికి తిరిగి వచ్చాడు. టోర్నమెంట్‌ ప్రారంభానికి చాలారోజుల ముందే వెనక్కి వచ్చేశాడు. అలా అర్ధాంతరంగా వెనక్కి మళ్లడానికి చెన్నై సూపర్‌ కింగ్స్‌ మీద ఉన్న అసహనం, అసంతప్తితోనే సురేష్‌ రైనా ఈ టోర్నమెంట్‌కు దూరం అయ్యాడనే రుమార్లు గట్టిగా వినిపిస్తున్నాయి. తనకు కేటాయించిన రూమ్‌ విషయంలో సురేష్‌ రైనా అసంతప్తి వ్యక్తం చేశాడని, దాన్ని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ పెద్దగా పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ టోర్నమెంట్‌కు దూరం అయ్యాడనే వార్తలు స్పోర్ట్స్‌ వరల్డ్‌లో చక్కర్లు కొడుతున్నాయి. అది వేరే విషయం. చెన్నై టీమ్‌ మేనేజ్‌మెంట్‌పైనే ఉన్న తన అసంతప్తిని వ్యక్తం చేసిన సమయంలో స్నేహితుడు, టీమ్‌ కేప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ సైతం పట్టించుకోలేదని, దాంతో సురేకుష్‌ రైనా ధోనీపై అలక బూనాడని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *