వ్యాక్సిన్‌ రెడీ అయిపోతుందా ?

 

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా రక్కసి నుంచి రక్షించడానికి శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేస్తున్నారు. వాటిలో కొన్ని ప్రయోగాలు చివరిదశలో ఉన్నాయి. అలాగే మన దేశంలో కూడా మూడు వ్యాక్సిన్లు చివరి దశలో ఉన్నట్లు సమాచారం. కాగా వ్యాక్సిన్‌ సిద్ధమైన దాని పంపిణీ పెద్ద ఎత్తున చేపట్టాలంటే ఇప్పట్నుంచే చర్యలు చేపట్టాలి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ సురక్షితంగా భద్రపరచడం సహా నిల్వ సామర్థ్యంపై సరైన ప్రణాళిక రూపొందించాలని అన్ని రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్రం కోరింది. వ్యాక్సిన్‌ ఒక్కసారి ఆమోదం పొందిన తర్వాత దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు సైతం సులభంగా చేరుతుంది. తద్వారా ప్రజలందరికీ సులువుగా వ్యాక్సిస్‌ అందుబాటులోకి వచ్చినట్టే. అయితే ఈ ఏడాది చివరినాటికి కరోనా వ్యాక్సిన్‌ ప్రజలకు అందుబాటులో ఉంటుందంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *