కూతుళ్ళకి మంచి బుద్దులు చెప్పాలాట

 

‘కూతుళ్లకు మంచి బుద్ధులు చెప్పాల్సిన బాధ్యత ప్రతి తల్లి,తండ్రిపై ఉందని వివాదస్పద వ్యాఖ్యలు చేశాడో బీజేపీ ఎమ్మెల్యే . అంతేకాదు.. వారికి సంస్కతి, సంప్రదాయాలు నేర్పాలనీ. అప్పుడే అత్యాచారాలు తగ్గుతాయి’ అని సెలివిచ్చాడు. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్‌. గతంలో ఓ సందర్భంలో మాట్లాడుతూ గాంధీని చంపిన గాడ్సే ఉగ్రవాది కాదని, అతను చేసింది చిన్న తప్పు మాత్రమే అని అన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై చేసిన వ్యాఖ్యలు కూడా వివా దాస్పదమయ్యాయి. ఎమ్మెల్యే ఆమెను క్రూరమైన మహిళగా అభివర్ణించారు. ఇప్పుడు దళిత యువతి అత్యాచారం విషయంలోనూ తన నోటి దురుసు తగ్గించుకోలేదు. అసలు విషయానికొస్తే ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్‌లో 19 ఏళ్ల దళిత యువతిపై అత్యాచారం, హత్య ఉదంతంతో దేశంలో నిరసనలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. అత్యాచారాలను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో తరచూ జరుగుతున్న సామూహిక అత్యాచారాలపై ప్రతిపక్షాలు ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతున్నాయి. రామరాజ్యం కొనసాగు తోందని ప్రజలు భావిస్తున్నప్పటికీ అత్యాచారాలు ఎందుకు కొనసాగుతున్నాయి అని ఓ సమావేశంలో విలేకరి అడిగిన ప్రశ్నకు ఎమ్మెల్యే సురేంద్ర సింగ్‌ సమాధా నమిస్తూ.. నేను ఎమ్మెల్యేనే కాకుండా నేను ఓ ఉపాధ్యాయుడిని కూడా. అలాంటి సంఘటనలు సంస్కారంతోనే తగ్గుతాయి. కానీ ప్రభుత్వ పాలనతో కాదు. ప్రభుత్వం మహిళలను రక్షించేందుకు కట్టుబడి ఉంది. అలాంటి సమయంలో తల్లిదండ్రులు అమ్మాయిలకు సంస్కారం నేర్పాలి. ఇంతకుమించి ప్రత్యామ్నాయం లేదు’ అని అన్నారు. దీంతో బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలతో తీవ్ర దుమారం రేగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *